పోరుమామిళ్లలో దివ్యాంగ విద్యార్థులకు తప్పని కష్టాలు: రూములు పుస్తకాల పాలు.. దివ్యాంగ పిల్లలు వరండా పాలు!!
పోరుమామిళ్ల (కడప జిల్లా): సెప్టెంబర్ 30ప్రజావాణి పోరుమామిళ్ల మండల కేంద్రంలోని దివ్యాంగ పిల్లల భవిత వనరుల కేంద్రం (ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రం) లో ప్రభుత్వ ఉచిత విద్యా విధానం అపహాస్యమవుతోంది. సమాజంలో అందరితో పాటు సమానంగా దివ్యాంగులకు కూడా విద్యా హక్కు కల్పించాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వారికి బోధించడానికి ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడిని కూడా .నియమించారు ప్రస్తుతం ఈ కేంద్రంలో సుమారు ఏడుగురు నుండి పది మంది వరకు ప్రత్యేక అవసరాలు గల...