prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 12:11 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోరుమామిళ్లలో దివ్యాంగ విద్యార్థులకు తప్పని కష్టాలు: రూములు పుస్తకాల పాలు.. దివ్యాంగ పిల్లలు వరండా పాలు!!

పోరుమామిళ్ల (కడప జిల్లా): సెప్టెంబర్ 30ప్రజావాణి  పోరుమామిళ్ల మండల కేంద్రంలోని దివ్యాంగ పిల్లల భవిత వనరుల కేంద్రం (ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రం) లో ప్రభుత్వ ఉచిత విద్యా విధానం అపహాస్యమవుతోంది. సమాజంలో అందరితో పాటు సమానంగా దివ్యాంగులకు కూడా విద్యా హక్కు కల్పించాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వారికి బోధించడానికి ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడిని కూడా .నియమించారు  ప్రస్తుతం ఈ కేంద్రంలో సుమారు ఏడుగురు నుండి పది మంది వరకు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.అయితే, అధికారుల నిర్లక్ష్యం మరియు సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ చిన్నారుల విద్యాభ్యాసానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలు మరియు ఇతర సామగ్రిని భద్రపరచడానికి ఈ వనరుల కేంద్రానికి చెందిన గదులను గోదాములుగా మార్చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన వేలాది పుస్తకాల బస్తాలను లోపల గదుల్లో దట్టించి తాళాలు వేయడంతో, చిన్నారులు కూర్చోవడానికి కనీస స్థలం లేకుండా పోయింది.దీనివల్ల, ఎంతో సున్నితంగా ఉండే ఈ దివ్యాంగ పిల్లలను తరగతి గదుల లోపల కూర్చోబెట్టి చదివించాల్సింది పోయి, గత్యంతరం లేక బయట వరండాలోనే కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎండ, వాన మరియు బయట వాతావరణం వల్ల ఈ ప్రత్యేక పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుడు అందుబాటులో ఉన్నప్పటికీ, సరైన వసతి కల్పించకపోవడంపై స్థానికులు మరియు తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని,