పోరుమామిళ్లలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం: ఘనంగా నివాళులర్పించిన రేంజ్ అధికారి రఘునాథ రెడ్డి మరియు సిబ్బంది

పోరుమామిళ్ల, సెప్టెంబర్ 11:ప్రజావాణి జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోరుమామిళ్ల అటవీ శాఖ రేంజ్ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీ రఘునాథ రెడ్డి,నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా అటవీ సంపదను,వన్యప్రాణులను కాపాడే క్రమంలో స్మగ్లర్లు, వేటగాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు.వారి త్యాగాలను స్మరిస్తూ కార్యాలయ ప్రాంగణంలో అందరూ కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. విధుల పట్ల అప్రమత్తత,నిజాయితీ...