పోరుమామిళ్లలో చక్రం తిప్పుతున్న లిక్కర్ డాన్లు.. ఆగని దందా!

పోరుమామిళ్ల సెప్టెంబర్ 13 ప్రజావాణి మండలంలో లిక్కర్ దందాపై ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.మద్యం విక్రయాల్లో కొందరు సిండికేట్‌గా ఏర్పడి.ఎమ్మార్పీ ధరలకు పాతర వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా వినాయక చవితి పండుగను టార్గెట్‌గా చేసుకుని. క్వార్టర్ బాటిల్‌పై పది నుంచి ఇరవై రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారంటూ పలువురు మందుబాబులు ఆరోపిస్తున్నారు.ఇది ఒక్కో బాటిల్‌పై చిన్న మొత్తం అనిపించినా. రోజుకు వందలు, వేల బాటిళ్లు విక్రయిస్తే సామాన్యుడి జేబుపై పడే భారం ఎంత ఉంటుందో అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.రోజువారీ కూలీలు, పేద, సామాన్య...