పోరుమామిళ్లలో ఉధృతమైన వీఆర్ఏల నిరసన: తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని మూడో రోజు ధర్నా
కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 30ప్రజావాణి మండల తహశీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయం వద్ద ఏపీ వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరి మరింత ఉధృతమైంది. మంగళవారం నాటి నిరసనలో భాగంగా వీఆర్ఏలు తమను తక్షణమే రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. కాలపరిమితితో కూడిన ఇంక్రిమెంట్లు, జీతాల పెంపుతో పాటు దశాబ్దాలుగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించడమే ఏకైక మార్గమని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నిరసన దీక్షలో కూర్చున్న వీఆర్ఏల సంఘం...