పోరుమామిళ్లలో అంబరాన్నంటిన ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు: ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బెడ్ల పంపిణీ.. సేవా కార్యక్రమాల్లో వెల్లువెత్తిన జనం
పోరుమామిళ్ల,సెప్టెంబర్ 17ప్రజావాణి భారతదేశ కీర్తిపతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడిస్తూ,దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న అద్వితీయ నాయకుడు,భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 76వ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో అత్యంత వైభవంగా,పండగ వాతావరణంలో జరిగాయి.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థానిక నాయకులు,కార్యకర్తలు మరియు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సేవా కార్యక్రమాలతో మోదీ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఘనంగా కేక్ కటింగ్ –మోదీ అమరహే నినాదాలు స్థానిక బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో...