పోరాటమే ఊపిరిగా… సేవనే మార్గంగా… సీతక్క ఒక స్ఫూర్తి శిఖరం
*పోరాటమే ఊపిరిగా… సేవనే మార్గంగా… సీతక్క ఒక స్ఫూర్తి శిఖరం* *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- ఒక నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టి, ఎన్నో కష్టాలను ఎదుర్కొని, జీవితంలో ఎదురైన ప్రతి అడ్డంకిని మెట్టుగా మార్చుకుంటూ, ప్రజల కోసం పోరాడుతూ, అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నిలిచిన దనసరి అనసూయ సీతక్క జీవితం ఒక వ్యక్తిగత విజయగాథ మాత్రమే కాదు… పోరాటం, పట్టుదల, ధైర్యం, సేవాభావం ఉంటే సామాన్య మనిషి కూడా అత్యున్నత స్థాయికి ఎదగగలడనే సజీవ సందేశం. ...