prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 1:26 pm Digital Edition : PRAJA VANI

పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా’ నర్సింలు మాతృమూర్తి మృతి

.’ పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా’ నర్సింలు మాతృమూర్తి మృతి….
రంగారెడ్డి జిల్లా బ్యూరో . సెప్టెంబర్ 28 ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేనా నర్సింలు. తల్లి కమలమ్మ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కమలమ్మ మృత్తి వార్త . తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు పోతుగల్ గ్రామానికి చేరుకుని గ్రామ సర్పంచ్ పామేన నరసింహులు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్. షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపల్లి పెంటారెడ్డి. గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ షాబాద్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఈగ ప్రభాకర్ రెడ్డి. తదితరులు కమలమ్మ భౌతిక దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పామెన నర్సింలు కుటుంబాన్ని ఓదార్చి దుఃఖంలో భాగస్వాములు అయ్యారు. కమలమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. నాయకుల వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోతుగల్ గ్రామ ప్రజలతో పాటు ఆయా గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు కమలమ్మ అంతిమయాత్రలో పాల్గొన్నారు.

‘