లక్ష్మీపుత్రుడు బిరుదుతో ఎదిగి కేసీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన పోచారం.
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.
అధికారం కోసం వంద రోజుల్లో అమలు చేస్తానని వెయ్యి రోజులు కావస్తున్న నెరవేరని హామీలు.
బాన్సువాడ సర్ ప్రక్రియ ఇంచార్జ్ తోట ఆగన్న.
పోతంగల్లో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై మహా ధర్నా, భారీ సభ.



కోటగిరి/ప్రజావాణి:-కేసీఆర్ ఇచ్చిన లక్ష్మీపుత్రుడు బిరుదు తో ఎదిగిన పోచారం శ్రీనివాసరెడ్డి చివరకు కేసీఆర్‌కే వెన్ను పోటు పొడిచి పార్టీ మారిపోయారని మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాజి రెడ్డి గోవర్ధన్ విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు కావస్తున్నా వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని బాన్సువాడ నియోజకవర్గ సర్ ప్రక్రియ ఇంచార్జ్ తోట ఆగన్న మండిపడ్డారు.సోమవారం పోతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల దగా పాలనపై మహా ధర్నా,భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి బాజిరెడ్డి గోవర్ధన్,తోట ఆగన్న పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సభను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ విధ్వంస పాలన కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్లు తెలిపారు.కేసీఆర్ పాలనలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను విస్మరించి,రాష్ట్రంలోని రైతులకు,మహి ళలకు,నిరుద్యోగులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అయితే ప్రజాదరణ తెచ్చింది మాత్రం కేసీఆర్ అని స్పష్టం చేశారు.రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి, బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలందరూ సైనికులా కష్టపడాలని పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ ఎంఏ హకీమ్ తాత కానుకగా గతంలో ప్రకటించిన విధంగా మొదటి కాన్పులో ఆడబిడ్డను జన్మ నిచ్చిన మాతృమూర్తికి రూ.5 వేల నజరానా బాజీరెడ్డి చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల బీఆర్ఎస్ నాయకులు సూధం నవీన్,డాక్టర్ ఎం. ఏ.హకీమ్,నియోజకవర్గ నాయకులు జుబేర్,మోరే శ్రీనివా స్,నార్ల రత్నాకర్,అంజి రెడ్డి,ధర్మ తేజ మాధవరెడ్డి,దాస్, ఏజాజ్,విఠల్,నరేష్ రాథోడ్,శ్రీను,సాయి,నర్సింలు,గోపి రెడ్డి,ప్రశాంత్ రెడ్డి,మధు,రవీందర్,కోటగిరి మండల నాయ కులు మోరే కిషన్,తేల్ల రవి కుమార్,మట్టపల్లి దేవేందర్ రావు,కోటగిరి పోతంగల్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.