prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 10:48 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

పోచారం విద్యుత్ సరఫరా అంతరాయం….ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పవర్‌ కట్‌

పోచారం సెప్టెంబర్ 30 (ప్రజావాణి): పోచారం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 33 కేవీ బ్రేకర్ ఏర్పాటు పనులు చేపడుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు నారపల్లి విద్యుత్ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఇన్ఫోసిస్ హాస్టల్ పరిసరాలు, సెరేనియా హిల్స్, శివాలయం ప్రాంతం, పోచారం గ్రామం, అన్నానగర్, డాక్టర్స్ కాలనీ, విజయ్‌సాయి ఎన్‌క్లేవ్, గెలాక్సీ టవర్స్ తదితర ప్రాంతాల్లో, రామ్‌కీ, నీలిమా హాస్పిటల్, అరుంధతి కాలనీ, వైభవ్ కాలనీ, మినీ సింగపూర్, మోడీ బిల్డర్స్, ట్యూలిప్స్ గ్రాండ్ తదితర ప్రాంతాలు, స్వర్ణగిరి కాలనీ, పీజీఎస్ కాలనీ, సీఎస్‌వీఆర్ కళాశాల, హిమగిరి కాలనీ, జోడిమెట్ల ఎక్స్‌రోడ్ తదితర ప్రాంతాల్లో, సద్భావన టౌన్‌షిప్‌లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. విద్యుత్ శాఖ చేపడుతున్న పనులకు వినియోగదారులు సహకరించాలని నారపల్లి ఏఈ/ఓపీ అధికారులు కోరారు.