పోచారంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
ప్రజావాణి – కూసుమంచి సెప్టెంబర్ 17 పోచారంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం కూసుమంచి మండలం పోచారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజా పాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై కార్యక్రమంలో పాల్గొన్నవారు చర్చించారు. ఈ వేడుకల్లో పోచారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు....