prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 11:42 am Digital Edition : PRAJA VANI

పొంచి ఉన్న ప్రమాదం నడి రోడ్డుపై గుంత.. పట్టించుకొని అధికారులు, ప్రజా ప్రతినిధులు

పొంచి ఉన్న ప్రమాదం నడి రోడ్డుపై గుంత.. పట్టించుకొని అధికారులు, ప్రజా ప్రతినిధులు

మద్దూరు సెప్టెంబర్ 19, ప్రజా వాణి,

మండలంలోని గాగిల్లాపూర్ నుండి దూలిమిట్ట మండల కేంద్రానికి వెళ్లే బి టి రోడ్డు ధ్వంసం అయి వాహనాల రాకపోకలకు అంతరాయంగా మారడమే కాకుండా ప్రమాదం పొంచి ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా రైతులు బావుల వద్దకు వెళ్లాలంటే ఈ దారి వెంటే వెళ్ళాలి ప్రస్తుతం రాత్రి పూట కరెంట్ కోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్ళేటప్పుడు ప్రమాదం ఏ రీతిగా వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తక్షణమే గుంత పూడ్చి ప్రమాదం నుండి కాపాడాలని రెండు మండలాల ప్రజలు అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.