పైప్‌లైన్ లీకేజీతో నీటి వృథా.. వాహనదారులకు అవస్థలు

పైప్‌లైన్ లీకేజీతో నీటి వృథా.. వాహనదారులకు అవస్థలు ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 28 కూసుమంచి మండలం కిష్టాపురం–పోచారం గ్రామాల మధ్య బీటీ రోడ్డు పక్కన మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది. పైప్‌లైన్ నుంచి ఒత్తిడితో బయటకు వస్తున్న నీరు రోడ్డుపైకి ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు నీటిని దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుండటంతో ప్రమాదాల భయం నెలకొంది. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే విలువైన తాగునీరు ఇలా...