prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 12:53 pm Digital Edition : PRAJA VANI

పైప్‌లైన్ లీకేజీతో నీటి వృథా.. వాహనదారులకు అవస్థలు

పైప్‌లైన్ లీకేజీతో నీటి వృథా.. వాహనదారులకు అవస్థలు
ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 28
కూసుమంచి మండలం కిష్టాపురం–పోచారం గ్రామాల మధ్య బీటీ రోడ్డు పక్కన మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది. పైప్‌లైన్ నుంచి ఒత్తిడితో బయటకు వస్తున్న నీరు రోడ్డుపైకి ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు నీటిని దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుండటంతో ప్రమాదాల భయం నెలకొంది.
మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే విలువైన తాగునీరు ఇలా వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై నీరు చేరడంతో రహదారి దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రహదారిపై ప్రవహిస్తున్న నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.