పేరుకేమో కొత్త గాలి మిషన్..వసతుల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం! పోరుమామిళ్ల పీ.ఎస్.ఆర్ భారత్ పెట్రోల్ బంకులో వాహనదారుల అవస్థలు.

బోర్డుల మీద ఉచిత సేవలు..తీరా చూస్తే అన్నీ మూతపడ్డ తలుపులు! పెట్రోల్ కొట్టించుకుంటే చాలు అనుకుంటున్న యాజమాన్యానికి, వినియోగదారుల అవసరాలు పట్టవా?" కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్16ప్రజావాణి మండలంలోని రంగసముద్రం పంచాయతీ నరసింహపల్లె విలేజ్ సమీపంలో మెయిన్ రోడ్డుపై ఉన్నటువంటి పీ.ఎస్.ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ (భారత్ పెట్రోలియం) బంకులో కనీస వసతులు పడకే శాయి. నిత్యం వందలాది వాహనాలతో బిజీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులో వినియోగదారులకు అందాల్సిన ఉచిత సేవలు పూర్తిగా అలంకారప్రాయంగా మారాయి.దూరప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు,ముఖ్యంగా...