prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 9:06 am Digital Edition : PRAJA VANI

పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం <br>

పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం

మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి

అనంతపురం బ్యూరో ఆగస్టు 01 ప్రజా వాణి
అనంతపురం నగరంలోని
29వ డివిజన్‌లోని బూత్ నెం. 155 పరిధిలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశారు.  మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి  ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు అన్నింటిని నెరవేర్చడం జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 4 వేల రూపాయలు పెన్షన్  తో పాటు మూడు నెలల అరియర్స్ కలిపి ఒకే నెలలో 7 వేల రూపాయలు ఇచ్చిన  ఘనత కూటమి ప్రభుత్వానికె దక్కుతుందన్నారు. ప్రతినెల ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకే పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను అన్నింటిని నెరవేర్చడం జరిగిందన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని చేపట్టడం  జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చుతాడని అన్నారు. గతంలో ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  1995 నుంచి 2004 వరకు  ముఖ్యమంత్రిగా ఉన్నారని హైదరాబాద్ సిటీని హైటెక్ సిటీగా మార్చారన్నారు. పంపిణీ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తలారి ఆదినారాయణ, జిల్లా  అధికార ప్రతినిధి సరిపూటి రమణ, మున్వర్ తదితరులు పాల్గొన్నారు.