prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 11:37 am Digital Edition : PRAJA VANI

పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ అండ

పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ అండ

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 18

షాబాద్ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో వైద్య ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.