prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 9:29 pm Digital Edition : PRAJA VANI

పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారుసమస్యపై మండల తహసీల్దార్ కి వినతి పత్రం

పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారుసమస్యపై మండల తహసీల్దార్ కి వినతి పత్రం

 

* సేవా సంకల్ప అభియాన్ సన్నాహక సమావేశం

 

* మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం

 

* రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుప్పాల రఘు

 

జమ్మికుంట సెప్టెంబర్ 10 (ప్రజావాణి)

 

భారతీయ జనతా పార్టీ ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి నేతృత్వంలో సేవా సంకల్ప అభియాన్ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుప్పాల రఘు విచ్చేశారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారుప్రతి బీజేపీ కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనిపిలుపునిచ్చారుఅలాగే బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, సేవే లక్ష్యంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారుసేవా సంకల్ప అభియాన్‌ను ఇల్లందకుంట మండలంలో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు22-ఏభూముల సమస్యపై తహసీల్దార్‌కు మెమోరాండంఅదేవిధంగాతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22-ఏ చట్టం అమలులో నిర్లక్ష్యం వహిస్తూ అర్హులైన పేదల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించకుండా కాలయాపన చేస్తోందని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారుపేద రైతులు భూ యజమానులు తమ భూములను వినియోగించుకోలేక తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారనినిషేధిత జాబితాలో ఉన్న అర్హులైన భూములను వెంటనే పరిశీలించి 22-ఏజాబితా నుంచి తొలగించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారుఈ సమస్యపై ఇల్లందకుంట మండల తహసీల్దార్ కి మెమోరాండం సమర్పించడంజరిగిందిఅధికారులు వెంటనే స్పందించి పేదల భూ సమస్యలను పరిష్కరించాలని కోరారుమండల ప్రధానకార్యదర్శి గుత్తికొండ రాంబాబుకంకణాల రవీందర్ రెడ్డిఇంగ్లే ప్రభాకర్ కంకణాల సురేందర్ రెడ్డి, తాళ్ల లావణ్య,చింతల ఐలయ్య, గుడికందుల పావని, ఉప్పు దుర్గయ్య, సోమిడి సురేందర్ కొక్కుల దేవేందర్,తుపాకుల సతీష్,బండారి అమరేందర్ మురహరి గోపాల్,తాళ్ల పాపిరెడ్డి మట్ట పవన్ రెడ్డి జంగం సమ్మయ్య గురుకుంట్ల సంజీవ్ వడ్లకొండ జలపతి ఎలావేణి శ్రీధర్, దేవునూరి లచ్చన్న,చిట్ల శ్రీనివాస్,చీపతి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు