పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్.. రూ.1,18,430 నగదు స్వాధీనం ఏటూరునాగారం సెప్టెంబర్ 01 ములుగు జిల్లా ప్రతినిధి(ప్రజావాణి) పేకాట ఆడుతున్న వారిపై ఏటూరునాగారం పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1,18,430 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏటూరునాగారం ఎస్‌ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మంగపేట రోడ్డులోని చెంతల బోరు సమీపంలోని వ్యవసాయ భూమిలో కొంతమంది వ్యక్తులు గుమిగూడి పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ మహేష్ ఆధ్వర్యంలో జీ. కృష్ణ, కే....