prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 5:23 pm Digital Edition : SRIKANTH MULUGU

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

 

ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్‌.. రూ.1,18,430 నగదు స్వాధీనం

ఏటూరునాగారం సెప్టెంబర్ 01 ములుగు జిల్లా ప్రతినిధి(ప్రజావాణి)

పేకాట ఆడుతున్న వారిపై ఏటూరునాగారం పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1,18,430 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఏటూరునాగారం ఎస్‌ఐ మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మంగపేట రోడ్డులోని చెంతల బోరు సమీపంలోని వ్యవసాయ భూమిలో కొంతమంది వ్యక్తులు గుమిగూడి పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ మహేష్‌ ఆధ్వర్యంలో జీ. కృష్ణ, కే. ధ్రువ, జె. హరీష్, బి. సుధాకర్, పి. సదానందం, డి. చంద్రమోహన్, అశోక్‌లతో కలిసి పోలీసులు అక్కడికి చేరుకుని పేకాట స్థావరంపై దాడి చేశారు.
ఈ దాడిలో ఉప్పు రాజేందర్, కుంభం రాజేష్, నర్సింహ, ఎస్‌కే అజ్మత్, మునిగల పూర్ణచందర్, కేశవేని వెంకన్నలను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పేకాటకు సంబంధించిన రూ.1,18,430 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏటూరునాగారం ఎస్‌ఐ మహేష్ తెలిపారు. మండలంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.