prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 5:41 pm Digital Edition : SANJEEV ODELA

పెద్దమ్మతల్లి దేవాలయానికి ఎల్‌ఈడీ బోర్డు ఏర్పాటు

సేవాభావంతో ముందుకొచ్చిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ చిట్ల శ్రీనివాస్ ముదిరాజ్

 

 

ఓదెల మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో కొలువుదీరిన పెద్దమ్మతల్లి దేవాలయానికి పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ చిట్ల శ్రీనివాస్ ముదిరాజ్ ఎల్‌ఈడీ బోర్డును ఏర్పాటు చేశారు. దేవాలయానికి అవసరమైన సౌకర్యాన్ని కల్పించేందుకు ముందుకు వచ్చి ఎల్‌ఈడీ బోర్డును అందించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉప్పరపల్లె ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు.

గ్రామంలోని ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు