పెద్దమల్లారెడ్డిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
పెద్దమల్లారెడ్డిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు భిక్కనూర్, సెప్టెంబర్ 26 ( ప్రజావాణి ): భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి సర్పంచ్ కోడూరి సాయగౌడ్ పాలకవర్గ సభ్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి,వార్డు సభ్యులు వడ్ల శ్రీనివాస్,మాధవ రెడ్డి, కంతి నర్సింలు, బుచ్చయ్య, అనిల్, రామస్వామి, నాలుకే రాకేష్, పిల్లి బాబు,నాయకులు ఇటిక్యాల సురేందర్...