prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 5:38 pm Digital Edition : PRAJA VANI

పెద్దమల్లారెడ్డిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

పెద్దమల్లారెడ్డిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

భిక్కనూర్, సెప్టెంబర్ 26 ( ప్రజావాణి ):

భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి సర్పంచ్ కోడూరి సాయగౌడ్ పాలకవర్గ సభ్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి,వార్డు సభ్యులు వడ్ల శ్రీనివాస్,మాధవ రెడ్డి, కంతి నర్సింలు, బుచ్చయ్య, అనిల్, రామస్వామి, నాలుకే రాకేష్, పిల్లి బాబు,నాయకులు ఇటిక్యాల సురేందర్ రెడ్డి, భాగా రెడ్డి, తిప్పని ఇస్తారి,వడ్ల బ్రహ్మచారి, ఏర్వా ధనరాజ్,నాయకులు పాల్గొని ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని, ధైర్యసాహసాలను నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ పంచాయతి కార్యదర్శి లక్ష్మి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.