prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 10:48 am Digital Edition : PRAJA VANI

పెద్దపల్లి జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక

పెద్దపల్లి జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక

పెద్దపల్లి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికలు మరియు సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి తెలిపారు.

ఈ జట్ల ఎంపిక 19-09-2026 శనివారం రోజున ఉదయం 11 గంటలకు సుల్తానాబాద్‌లోని ఆల్ ఫోర్స్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా తమ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా టెన్త్ మెమో లేదా ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు.

జూనియర్ బాలురు:
20 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, 05-11-2006 తర్వాత జన్మించిన వారు అర్హులు. బరువు 75 కిలోల లోపు ఉండాలి.

జూనియర్ బాలికలు:
20 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, 30-11-2006 తర్వాత జన్మించిన వారు అర్హులు. బరువు 65 కిలోల లోపు ఉండాలి.

సబ్ జూనియర్ బాలబాలికలు:
16 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, 13-12-2010 తర్వాత జన్మించిన వారు అర్హులు. బరువు 55 కిలోల లోపు ఉండాలి.

జిల్లాలోని క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఎంపికలను విజయవంతం చేయాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చింతకుంట విజయ రమణారావు మరియు అధ్యక్షుడు ధర్మయ్య మరియు కార్యదర్శి కరుణాకర్ రెడ్డి మరియు అసోసియేషన్ సభ్యులు కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9908133 143, 9866974147