*పెంబర్తిలో ఈ నెల 20న సాంస్కృతిక కార్యక్రమాలు*
*జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆహ్వానం*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 17(ప్రజావాణి):
నెల్లుట్ల ఫౌండేషన్, కవులు కళాకారుల ఐక్యవేదిక జనగామ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20న జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని జనగామ క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహకులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు నెల్లుట్ల రవీందర్ రావు, జి.కృష్ణ, అయిలా సోమనర్సింహాచారి,గ్రామ సర్పంచ్ చిన్నబోయిన రేఖరాజు కలిసి ఎమ్మెల్యేకు కార్యక్రమాలు వివరించారు.
పెంబర్తి గ్రామ పంచాయతీ వేదికలో ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి సంగీతా విభావరి ప్రారంభమౌతుంది. ‘భైరవ పుష్పం’, ‘సత్య హరీశ్చంద్ర’ అనే రెండు నాటకాలను ప్రదర్శిస్తారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సహాయ కార్యదర్శి బేతి వీరారెడ్డి, నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లుట్ల రవీందర్ రావులకు ప్రత్యేక అభినందన సభను ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ సర్పంచ్ చిన్నబోయిన రేఖరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమ కొనసాగుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కార్యక్రమాలను ప్రశంసిస్తూ రావడానికి సానుకూలత వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జనగామ మాజీ మున్సిపల్ చైర్మన్ జి.ప్రేమలతా రెడ్డి, కౌన్సిలర్ పానుగంటి సువార్త, మాజీ సర్పంచ్ బొల్లం శారద, మాజీ కౌన్సిలర్ అనిత తదితరులు పాల్గొన్నారు.