పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
*పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి* *విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు* *పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజావాణి): పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా గల ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్ లో...