పులివెందులలో వైఎస్ జగన్‌తో నల్లేరు విశ్వనాథ రెడ్డి భేటీ.. పార్టీ బలోపేతంపై సుదీర్ఘ చర్చ!

పోరుమామిళ్ల సెప్టెంబర్ 01 ప్రజావాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  సంస్థాగత బలోపేతం,భవిష్యత్తు రాజకీయ కార్యాచరణే లక్ష్యంగా కడప జిల్లాలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి ఈరోజు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి,ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్. అవినాష్ రెడ్డితో కలిసి జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గ ప్రగతి,పార్టీ బలోపేతంపై సుదీర్ఘ చర్చ పులివెందుల క్యాంపు...