పోరుమామిళ్ల సెప్టెంబర్ 01 ప్రజావాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం,భవిష్యత్తు రాజకీయ కార్యాచరణే లక్ష్యంగా కడప జిల్లాలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి ఈరోజు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి,ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్. అవినాష్ రెడ్డితో కలిసి జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
నియోజకవర్గ ప్రగతి,పార్టీ బలోపేతంపై సుదీర్ఘ చర్చ
పులివెందుల క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని తాజా రాజకీయ పరిణామాలు,ప్రజా సమస్యలపై వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో నల్లేరు విశ్వనాథ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లేందుకు,క్యాడర్‌లో నూతనోత్తేజం నింపేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై జగన్మోహన్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. ప్రజాపక్ష పోరాటాలు: క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడాలని అధినేత పిలుపునిచ్చారు.క్యాడర్‌కు భరోసా పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు,నాయకునికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.సమన్వయం ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, కీలక నేతలు సమిష్టిగా ముందుకు సాగాలని సూచించారు.
వైఎస్సార్ ఆశయాలే మార్గదర్శకం: నల్లేరు విశ్వనాథ రెడ్డి
ఈ భేటీ అనంతరం నల్లేరు విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ.మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో, ప్రియతమ నాయకుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో ప్రజలకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరింత ఎత్తున ఎగరేసేందుకు,ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన పునరుద్ఘాటించారు.ఎంపీ అవినాష్ రెడ్డి సహకారంతో పార్టీ శ్రేణులను ఏకం చేసి రాబోయే రోజుల్లో ప్రజాపక్ష కార్యాచరణతో ముందుకు వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.