పుట్టపహాడ్ భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఎం. ఆంజనేయులుకు ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ’ పురస్కారం
పుట్టపహాడ్ భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఎం. ఆంజనేయులుకు ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ’ పురస్కారం పరిగి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి) కులకచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో విద్యాబోధనలో అంకితభావం, విద్యార్థుల ప్రగతి పట్ల నిరంతర తపన కనబరుస్తున్న పుట్టపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీ ఎం. ఆంజనేయులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2026కు ఎంపికయ్యారు. ఈ ప్రకటన పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సమయపాలన, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం: గత నాలుగేళ్లుగా ఒక్క రోజు...