prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 11:08 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు వేముల మహేష్ గౌడ్ శుభాకాంక్షలు…రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీభవన్‌లో అభినందనలు

పోచారం, సెప్టెంబర్ 15 (ప్రజావాణి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ మంగళవారం గాంధీభవన్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందించి అభినందనలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలకు అండగా నిలవాలని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ మరింత విజయవంతంగా ముందుకు సాగాలని వేముల మహేష్ గౌడ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, ఎదులాబాద్ గ్రామ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బింగి రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.