prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 3:20 pm Digital Edition : MAHESH MEDCHAL

పీవీ హైస్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెరిమనీ

పీవీ హైస్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెరిమనీ

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన భావన పెంపొందించడమే లక్ష్యం

మేడ్చల్: పీవీ హైస్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు, వారికి అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించేలా ప్రోత్సహించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సమక్షంలో నూతన విద్యార్థి నాయకులను పరిచయం చేసి వారికి బాధ్యతలు అప్పగించారు. హెడ్ బాయ్‌గా శ్రీహర్ష, హెడ్ గర్ల్‌గా హాసిని బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థి నాయకులు పాఠశాల నియమ నిబంధనలను పాటిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె. రామేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ నరసింహులు గౌడ్, ఇన్‌చార్జ్ అనిత ప్రియ, అఫ్రీన్ బేగం పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, సమయపాలన, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవర్చుకోవడం భవిష్యత్‌లో ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పాఠశాల ప్రతిష్ఠను పెంచేందుకు కృషి చేయాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది. అనంతరం విద్యార్థి నాయకులను అభినందించి, వారి బాధ్యతల నిర్వహణకు ఉపాధ్యాయులు సహకరిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వాతంత్ర, వసంత, నజీమా, పీఈటీ మోహన్, ప్రవీణ్తో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.