*పీవీ పాఠశాలలో ప్రతిష్టించిన వినాయకుని ఘనంగా ఆటపాటల మధ్య నిమజ్జనం చేశారు*
*సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థుల సందడి.. వెయ్యి మందికి అన్నదానం*
మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని పీవీ పాఠశాలలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడికి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్ర
దాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలు, భక్తి గీతాల మధ్య గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల సందడితో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
*వెయ్యి మందికి పైగా అన్నదానం కార్యక్రమం నిర్వహించిన పాఠశాల యాజమాన్యం*
వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులకు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.
*సంప్రదాయాలు, సంస్కృతిపై అవగాహన*
విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు ఐక్యత, భక్తి భావాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కే. రామేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ నరసింహులు గౌడ్, అకాడమిక్ ఇన్‌చార్జ్ ప్రియా, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో ముగిసింది.