పీర్జాదిగూడ లేక్ వ్యూ కాలనీలో ఘనంగా మట్టి గణపతి నిమజ్జన వేడుకలు…రూ.46 వేలతో గణపతి లడ్డూ సొంతం చేసుకున్న జయరాం కుటుంబ సభ్యులు
పీర్జాదిగూడ, సెప్టెంబర్ 26 (ప్రజావాణి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ లేక్ వ్యూ కాలనీలో అధ్యక్షుడు బేవర జయరాం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి గణపతికి 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు ఐక్యంగా ఆనందోత్సాహాల మధ్య వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాగణపతి లడ్డూ వేలం పాట ఉత్సాహంగా, పోటాపోటీగా సాగింది. వేలం...