prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 8:45 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

పీర్జాదిగూడ లేక్ వ్యూ కాలనీలో ఘనంగా మట్టి గణపతి నిమజ్జన వేడుకలు…రూ.46 వేలతో గణపతి లడ్డూ సొంతం చేసుకున్న జయరాం కుటుంబ సభ్యులు

పీర్జాదిగూడ, సెప్టెంబర్ 26 (ప్రజావాణి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ లేక్ వ్యూ కాలనీలో అధ్యక్షుడు బేవర జయరాం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి గణపతికి 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు ఐక్యంగా ఆనందోత్సాహాల మధ్య వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాగణపతి లడ్డూ వేలం పాట ఉత్సాహంగా, పోటాపోటీగా సాగింది. వేలం పాటలో రూ.46 వేల ధరకు జయరాం కుటుంబ సభ్యులు గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. అలాగే స్వామివారి మణిహారాన్ని రూ.6 వేలతో యోగి కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా కుర్ర శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించిన లేక్ వ్యూ కాలనీ వాసులు ఆదర్శంగా నిలిచారని అభినందించారు. భక్తి భావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీ జనరల్ సెక్రటరీ దేవేందర్, కోశాధికారి హుస్సేన్ భాష, సభ్యులు రామకృష్ణ, యోగి, గోపి, శరత్ చంద్ర, బాలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.