prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 7:10 pm Digital Edition : PRAJA VANI

పీఏసీఎస్‌లో అవక తవకలపై విచారణ జరపాలి

*పీఏసీఎస్‌లో అవక తవకలపై విచారణ జరపాలి…*

*మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు ఫోన్‌లో వివరించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25*

యాదగిరిగుట్ట పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు సంబంధించిన ఎరువుల బస్తాల విషయంలో జరిగి నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కోరారు. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ ద్వారా యాదగిరి గుట్ట పీఏసీఎస్‌లో చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న వ్యవహారాన్ని వివరించారు. సుమారు 420–2020 బస్తాలు , 700 బస్తాల యూరియాకు సంబంధించి సుమారు రూ.23 లక్షల మేర అవక తవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరారు.
రైతులకు సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరిగినా వాటిని వెలికితీసి , బాధ్యు లపై చర్యలు తీసు కోవాలని బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. ఈ వ్యవ హారంలో అధికారులు , నాయకులు లేదా ప్రజా ప్రతి నిధుల ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలితే బాధ్యత వహించి రైతులకు క్షమాపణ చెప్పడంతో పాటు , నష్ట పోయిన మొత్తాన్ని తిరిగి డిపాజిట్ చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి , వారం రోజుల్లో సమగ్ర విచారణ పూర్తి చేసి వాస్తవాలను నిగ్గుతేల్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కోరారు.
రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి అవకతవకలను సహించేది లేదని, విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాలని ఆయన అన్నారు.