పి ఆర్ టి యు టీఎస్ లో చేరిక
పెద్దవంగర సెప్టెంబర్ 16 ప్రజావాణి
టీచర్స్ బడి వెబ్సైట్ ద్వారా సేవలు అందించిన, చిట్టి జాబిలి చానెల్ సృష్టి కర్తగా, టి ఎల్ ఎం మేకర్ గా, వర్క్ షీట్స్ రూపకర్త గా తెలిసిన, సుపరిచితుడు అయిన, ప్రస్తుతం యుపిఎస్ చిన్న వంగర లో పని చేస్తున్న వేముల ప్రకాష్ అనే ఉపాధ్యాయుడు టిపిటిఎఫ్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పి ఆర్ టి యు టీఎస్ లో చేరినాడు. గత 20 నెలల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి పని తీరుకు ఆకర్షితులై, ఉపాధ్యాయ సంఘాలలో అతి పెద్ద సంఘమైన పి ఆర్ టి యు టీఎస్ వల్ల మాత్రమే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించబడుతాయి అనే విశ్వాసంతో పి ఆర్ టి యు టీఎస్ లో చేరుతున్నానని తెలియ పరిచినాడు. పి ఆర్ టి యు టీఎస్ పెద్దవంగర మండల శాఖ అధ్యక్షుడు గంగిశెట్టి రమేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎండి . యాకూబ్ పాషా సభ్యత్వ నమోదు రసీదు ఇచ్చి ఆహ్వానించగా, ఈ కార్యక్రమంలో సంఘ సీనియర్ సభ్యులు J. యాకుబ్ రెడ్డి మరియు గూగులోతు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.