prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 6:59 pm Digital Edition : PRAJA VANI

పాలేరు నుండి పద్మభూషణ్ వరకు’డాక్టర్ బోయి భీమన్న నడక ఉన్నతమైంది.

పాలేరు నుండి పద్మభూషణ్ వరకు’డాక్టర్ బోయి భీమన్న నడక ఉన్నతమైంది.

దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాకీ చంద్ర భాను

మద్దూరు సెప్టెంబర్ 19, ప్రజావాణి,

డాక్టర్ బోయి భీమన్న జయంతి సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాకీ చంద్ర భాను గారు మాట్లాడుతూ అంటరానితనములో నుండి అత్యున్నతమైనటువంటి శిఖరాలను అందుకొని తన పద్య, గద్య, నాటక రచనల ద్వారా, తాను అనుభవించిన కష్టాలను అన్నింటిని వివరిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని 94 సంవత్సరాలు జీవించి సుదీర్ఘ ప్రయాణం చేసి, దళిత లోకానికి ఒక వేగుచుక్కగా నిలిచాడని అన్నారు. అదేవిధంగా కవి సామ్రాట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించి గొప్ప పేరును తెచ్చుకోవడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా కూడా పనిచేసి ఒక గొప్ప మార్పును తీసుకురావడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం అని తెలిపారు.డాక్టర్ బోయి భీమన్న ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని పేదరికం నిర్మూలనలో మరియు సమసమాజ స్థాపనలో కలిసి సమాజ నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో దళిత సేన జిల్లా బాధ్యులు పల్లె ఎల్లo పాల్గొన్నారు.