prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 1:26 pm Digital Edition : PRAJA VANI

పాలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్ దివాకర్‌ టీఎస్‌

పాలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్ దివాకర్‌ టీఎస్‌
ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 25
తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాలేరు జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ టీఎస్‌ శుక్రవారం పాలేరు జలాశయాన్ని పరిశీలించారు. జలాశయానికి చేరుతున్న వరద నీటి ప్రవాహం, నీటిమట్టం, కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జలాశయానికి సుమారు 11 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పాలేరు ఎడమ కాలువకు 2 వేల క్యూసెక్కులు, పాత కాలువకు 150 క్యూసెక్కులు, భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి ఎత్తిపోతల పథకాల మోటార్లను ఆన్‌ చేయాలని ఇరిగేషన్‌ శాఖ ఎస్సీ మంగళపూడి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. వరద పరిస్థితుల దృష్ట్యా పాలేరు వాగు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట ఇరిగేషన్‌ శాఖ ఎస్సీ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు ఉన్నారు.