prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 6:39 pm Digital Edition : MAHESH MEDCHAL

పార్కు స్థలాలను రక్షిస్తాం హైడ్రా అధికారి బాల గోపాల్ హామీ

పార్కు స్థలాలను రక్షిస్తాం హైడ్రా అధికారి బాల గోపాల్ హామీ

మేడ్చల్ ప్రజా ఆస్తులైన పార్కులు, చెరువుల రక్షణ తమ లక్ష్యమని హైడ్రా అధికారి వీ.బాల గోపాల్ తెలిపారు. మేడ్చల్ 297 డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీలోని 200 గజాల పార్కు స్థలం ఆక్రమణ గురించి కాలనీ అసోసియేషన్ సభ్యులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా అధికారులు మేడ్చల్ వచ్చి పార్కు ఆక్రమణల విచారణ జరిపారు. పార్కుకు సంబంధించిన అన్ని రికార్డులు, దస్తావేజులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారి బాల గోపాల్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్కును కాపాడి అసోసియేషన్కు అప్పగిస్తామని భరోసా ఇచ్చారు. హర్షం వ్యక్తం చేసిన కాలనీ అసోసియేషన్ సభ్యులు బాల గోపాల్ ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరమల్లు శ్రవణ్, అసోసియేషన్ సభ్యులు కామిడి జయపాల్ రెడ్డి, వెల్ది సంతోష్, స్వామి, నాగిరెడ్డి, వినీత్ సింగ్, విష్ణు వర్ధన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కిరణ్ రెడ్డి, పటేల్ ప్రభాకర్, సుదర్శన్ రెడ్డి, ప్రవీణ్, శివారెడ్డి, మాధవ్, వసంత, కపిల్, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.