పాతగూడూరులో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి సెప్టెంబర్ 04 (ప్రజావాణి): ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామంలోని మాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. చిన్నారల ముద్దులొలికే అలంకరణలు, సంప్రదాయ దుస్తులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల కోలాహలం నడుమ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ... శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి అందించిన భగవద్గీత సందేశం ఎంతో మహోన్నతమైనదని...