prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 2:37 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫారాల పంపిణీ

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామంలో సర్పంచ్ సంఘ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత బట్టల (యూనిఫామ్) పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు, వివోఏ అధ్యక్షులు, గ్రామ యువకులు, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.