పస్ర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ రవీందర్

పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్ష ఆన్‌లైన్ నమోదు, రికార్డుల నిర్వహణపై ఆదేశాలు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి నిస్పాక్షికంగా, పారదర్శకంగా సేవలందించాలి పస్ర (ప్రజావాణి) ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ములుగు డీఎస్పీ రవీందర్ పస్ర పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కలియతిరిగి పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించారు. రోడ్డు ప్రమాద...