*పలు గణనాథులను దర్శించుకున్న జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి*
*వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు మండపాల్లో అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొన్న జైపాల్ రెడ్డి*
మేడ్చల్, సెప్టెంబర్ 23: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వాహకుల ఆహ్వానం మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి గణనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ మండపాల్లో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.దేవరయాంజాల్‌లో ఇగ్నైట్ వింగ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని జైపాల్ రెడ్డి సందర్శించారు. మెటే బాలయ్య, గంధం ప్రవీణ్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం సాదా లింగారెడ్డి కాలనీలో శివలింగారి దినేష్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమానికి హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.తూంకుంటలో టీమ్ శివ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన జైపాల్ రెడ్డి, ఎస్. శ్రియన్ష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే బీట్స్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని జైపాల్ రెడ్డి, డివిజన్ కాంగ్రెస్ నాయకులు మాగం శశాంక్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. 
వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి అభినందించారు. కార్యక్రమాల్లో ఆయా ప్రాంతాల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.