నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
సోమవారం చండూరు మండలం లోని పలు ఎరువులు దుకాణాల్లో వ్యవసాయ అధికారులు ఆకస్మిక దాడి చేసి ఎరువులు యొక్క దస్త్రాలు, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో బి. వేణుగోపాల్, మండల అధికారి పి. మల్లేష్ పాల్గొని అన్ని రకాల ఎరువులకు సంబంధించి ఇన్వాయిసులు బిల్లుల, స్టాక్ రిజిస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని నాణ్యమైన ఎరువులు మాత్రమే రైతులకు అందించాలని ఎవరైనా దుకాణదారులు నకిలీ ఎరువులు అమ్మిన వారి యొక్క లైసెన్సులు రద్దు చేయడంతో పాటు, కేసులు కూడా చేస్తామని హెచ్చరించారు.