*పటేల్‌గూడ అభివృద్ధిలో నితీష్ శ్రీకాంత్ చొరవ!
*కాలనీ వాసుల చిరకాల కోరికకు కార్యరూపం..
*బీహెచ్‌ఈఎల్ మెట్రో ఎన్‌క్లేవ్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
అమీన్పూర్, సెప్టెంబర్ 17 (ప్రజావాణి): ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పటేల్‌గూడ మాజీ సర్పంచ్ ఈర్ల నితీష్ శ్రీకాంత్ మరో అభివృద్ధి పనికి చొరవ చూపారు. బీహెచ్‌ఈఎల్ మెట్రో ఎన్‌క్లేవ్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు లభించడంతో రోడ్ నంబర్–9లో పనులు గురువారం ప్రారంభమయ్యాయి. కాలనీ వాసులతో కలిసి నితీష్ శ్రీకాంత్ కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.
కాలనీలోని రోడ్ నంబర్ 6, 9, 12లకు సీసీ రోడ్లు మంజూరు కాగా.. తొలుత రోడ్ నంబర్–9 పనులు ప్రారంభమయ్యాయి. ఏళ్లుగా రోడ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసుల సమస్యను పరిష్కరించేందుకు నితీష్ శ్రీకాంత్ స్థానికులతో సమన్వయం చేస్తూ సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పనుల మంజూరుకు కృషి చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు.
*చిరకాల కోరికకు పరిష్కారం*
బీహెచ్‌ఈఎల్ మెట్రో ఎన్‌క్లేవ్ అసోసియేషన్ సభ్యులు .. సీసీ రోడ్లు తమ ఎన్నో ఏళ్ల కల, చిరకాల కోరిక అని పేర్కొన్నారు. సమస్యను పట్టించుకుని పనులు మంజూరయ్యేలా కృషి చేసిన ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా నితీష్ శ్రీకాంత్ ప్రజల సమస్యలపై స్పందిస్తూ అభివృద్ధి పనుల కోసం చొరవ తీసుకోవడాన్ని అభినందించారు.
రోడ్ల మంజూరుకు కృషి చేసిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, అమీన్‌పూర్ మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్, పటేల్‌గూడ మాజీ సర్పంచ్ ఈర్ల నితీష్ శ్రీకాంత్‌లకు కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.