prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 9:41 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

న్యాయవాదులందరికీ రిటైర్మెంట్, డెత్ బెనిఫిట్ రూ. 25 లక్షలు ఇవ్వాలి

జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 10 వేల స్టయిఫండ్ ఇవ్వాలి

న్యాయవాదుల ధర్నా – ఐలు డిమాండ్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

న్యాయవాదులకు రిటైర్మెంట్, డెత్ బెనిఫిట్ 25 లక్షలు అందించిన జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేల రూపాయలు స్టైఫండ్ అందించిన ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అనంతుల శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్గొండ కోర్ట్ ముందు న్యాయవాదులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా శంకరయ్య న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ పరిష్కారం కోసం న్యాయవాదుల సమస్యల కోసం ప్రధాన డిమాండ్ల సాధన తెలంగాణ రాష్ట్రంలో అన్ని కాంప్లెక్స్ ముందు కోర్టు ధర్నా చేసింది. 2026 ఆగస్టు 15, 16 లలో కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో జరిగిన ఐలు జాతీయ కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం-2001ను సవరించి, న్యాయవాదుల మరణం లేదా పదవీ విరమణ సందర్భంలో 25 లక్షలు డిమాండ్ చేశారు. న్యాయవాదులకు వైద్య సహాయంగా 5 లక్షలు, జూనియర్ న్యాయవాదులకు కనీసం ఐదు సంవత్సరాల పాటు నెలకు 10 వేల స్టైపెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్ష కార్యదర్శులు ఎ. సతీష్ కుమార్, బి. అశోక్ కుమార్ సీనియర్ న్యాయవాదులు జి. వెంకటేశ్వర్లు, పి. శ్రీనివాస్ రెడ్డి ఐలు జిల్లా నాయకులు పి. బ్రహ్మచారి, సత్తయ్య, యాదయ్య, వంశీకృష్ణ, నాగిరెడ్డి, దుర్గాప్రసాద్, సింగం శ్రీనివాస్, ఠాగూర్, సత్తయ్య, లాలయ్య, జమిల్, మసీదున్, భీమగాని గణేష్, సంపత్ కుమార్, జి కిషోర్ కుమార్, డి. నర్సాజి, పోలగోని శ్రీకాంత్ ,శివమణి, గిరి, పరమేష్, లెనిన్ బాబు, సిహెచ్ గోపాల్, భాస్కర్ రెడ్డి ,కామేష్, అప్రోజ్, జలంధర్, గిరి,లింగయ్య, అజ్మీర్, నగేష్ , వి. లింగయ్య, శ్రీను, బుచ్చి రాములు, తదితరులు పాల్గొనడం జరిగింది.