నేర్మట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి
ఇబ్రహీంపట్నం డిపో అధికారులకు వినతి పత్రం అందజేత
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నేర్మట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామ సర్పంచ్ నారపాక వసంత ధనయ్య, 9వ వార్డు మెంబర్ జెర్రిపోతుల ధనంజయ అన్నారు.శుక్రవారంనేర్మట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఇబ్రహీంపట్నం డిపో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా గ్రామానికి ఇబ్రహీంపట్నం డిపో బస్సు లేనందున మా మా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం, రాత్రి కస్తాలనుండి వెళ్లే బస్సు ధోని పాముల నుండి నేర్మట కు వచ్చే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను వారు విజ్ఞప్తి చేశారు. డిపో మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్ డిపో సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చామని వారు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ గ్రామానికి ఇబ్రహీంపట్నం బస్సు లేనందున రాకపోక లకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఇబ్రహీంపట్నం బస్సు డిపో ఒకప్పుడు వచ్చేదని ఇప్పుడు రాకపోవడంతో ఆర్టీసీ అధికారులను కలిశామని, వారు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. హైదరాబాదుకు, ఇబ్రహీంపట్నం ఉదయం, సాయంత్రం పోవాలంటే మా గ్రామ ప్రజలకు బస్సు సౌకర్యం లేనందున నానా తంటాలు పడుతున్నారని వారన్నారు. త్వరలోనే మన గ్రామానికి ఇబ్రహీంపట్నం బస్సు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ డిపో సెక్రటరీ నారాయణ, గ్రామ ప్రజలు జెర్రిపోతుల ధనంజయ, ఈరటి వెంకటయ్య, నారపాక అనిల్, బండమీది వేణు తదితరులు పాల్గొన్నారు.