నేడు వల్లంపట్ల బ్రదర్స్ యూత్ గణపతి మండపం వద్ద అన్నదానం
నేడు వల్లంపట్ల బ్రదర్స్ యూత్ గణపతి మండపం వద్ద అన్నదానం మద్దూరు సెప్టెంబర్ 24, ప్రజా వాణి, మండలంలోని వల్లంపట్ల గ్రామ బ్రదర్స్ యూత్ మండపం వద్ద నేడు సాయంత్రం 7గంటలకు బోడపట్ల అన్నదాత ఎల్లమ్మ కనకయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు.భక్తి పారవశ్యంలో యువత మునిగి పోవడంతో గ్రామంలో విఘ్నేశ్వర స్వామి పూజలు ఘనంగా జరిగాయని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అనిల్,నితీష్,ప్రవీణ్,సాయి,రమేష్,ఆంజనేయులు,ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.