నెల్లుట్ల లో ఐకేపీ వడ్ల కొనుగోలుకు నూతన కమిటీ ఎన్నిక!
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18(ప్రజావాణి):
లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామం లో ఐకేపీ వడ్ల కనుగోలుకు నూతన కమిటీ శుక్రవారం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ధాన్యం కనుగోలు కేంద్రానికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలం సర్వేనెంబర్ 670 లో నిర్ణయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కు ఉప సర్పంచ్ కు వార్డ్ మెంబర్స్ మహిళా సంఘాల వివో లు కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కోనుగోలు కేంద్రానికి సహకరించాము ఇప్పుడు కూడా అదే విధంగా అన్నిరకాలగా సహకరిస్తామని సర్పంచ్ రామకృష్ణ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీసీ శ్రీకాంత్ రెడ్డి, సిఏ రేవతి, జ్యోతి, సరిత,విమల, రమ,అధ్యక్షురాలు నల్ల ఉమ, బత్తిని విమల, కొనుగోలు కమిటీ వాసవి విఓ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. సభ్యులు వంగ ఉపేంద్ర, ఎడమ కొమ్మురమ్మ, గొరిగే కోమలత, సింగారం అనిత, మోటే అరుణ, హమాలీ సంఘ నాయకులు తదుతరులు పాల్గొన్నారు.