prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 4:17 pm Digital Edition : PRAJA VANI

నెల్లుట్ల గ్రామంలోని బంధం కుంటలోకి గోదావరి జలాలు – రైతుల్లో ఆనందం

*నెల్లుట్ల గ్రామంలోని బంధం కుంటలోకి గోదావరి జలాలు – రైతుల్లో ఆనందం*

*ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషికి రైతుల కృతజ్ఞతలు*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి ):
జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలోని బంధం కుంటలోకి గోదావరి జలాలు మంగళవారం చేరడంతో పరిసర ప్రాంత రైతుల్లో ఆనందం నెలకొంది.

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషితో గోదావరి జలాలు బంధం కుంటలోకి చేరుతున్నాయని సర్పంచ్ నర్సింగ రామకృష్ణ తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మలు వేసి కుంటలోకి నీళ్లు తీసుకురావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

బంధం కుంటను సందర్శించిన రైతులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, గ్రామ శాఖ అధ్యక్షులు మాచర్ల మహేందర్, పాక్స్ డైరెక్టర్ గుర్రం బాలరాజు, వీడీసీ చైర్మన్ బత్తిని అశోక్, డిజిటల్ యాక్సెస్ చైర్మన్ కుర్రెముల రమేష్, వార్డ్ మెంబర్ బత్తిని వేణు, నాయకులు – మండల ఎస్సి సెల్ అధ్యక్షులు నర్సింగ రమేష్, మండల కార్యదర్శి కొయ్యడ రామలింగ, మాజీ ఉపసర్పంచ్ మద్దూరి కుమార్, కొయ్యడ రామచంద్ర, శివరాత్రి ఎల్లయ్య, జెగ్గం ఆనంద్, అంబల యాదగిరి, బెల్లకొండ సోమనాథ్, కొత్తకొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.